వైద్య శాస్త్రంలో అత్యంత అరుదుగా సంభవించే సంఘటనకు మీరట్ లోని ఒక ఆసుపత్రి సాక్ష్యంగా నిలిచింది. పుట్టుకతో ఆడపిల్ల అయినా, జన్యుపరంగా పురుష లక్షణాలతో పెరిగిన యువతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ తరహా కేసుల్లో 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే తల్లి అయ్యే అవకాశం ఉంటుంది. ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సునీల్ జిందాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, పైకి చూడటానికి పూర్తి మహిళలా కనిపించే మాయ (పేరు మార్చడం జరిగింది) అంతర్గతంగా మాత్రం పురుష జన్యువులను కలిగి ఉంది. ఆమెలో పునరుత్పత్తి అండాలు తయారు కావు. తన జీవితంలో ఒక్కసారి కూడా నెలసరి కాలేదు. జననాంగాలు బిడ్డకు జన్మను ఇచ్చేలా లేవు. కానీ ఆమె ఆడ మనసు బిడ్డ కావాలని కోరుకుంది.
పొత్తి కడుపులో ఎక్కడో సాధారణ పరిమాణంతో పోలిస్తే, చిన్నగా ఉన్న గర్భాశయాన్ని గుర్తించిన డాక్టర్లు మూడేళ్ళపాటు కృషి చేసి దాన్ని బిడ్డను మోయగల స్థితికి తీసుకొచ్చారు. ఆ తరువాత ల్యాబ్ లో ఫలదీకరించిన అండాన్ని ప్రవేశపెట్టారు. అండం ఎదుగుదలను నిత్యమూ పరిశీలిస్తూ, అతి జాగ్రత్తగా కాపాడి డెలివరీ చేశారు. "ఈ ఘటన పురుషుడు కవల బిడ్డల్ని కనడంతో సమానం" అని డాక్టర్ సునీల్ వ్యాఖ్యానించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన