విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు కమిటయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ రోజు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉందని స్పష్టం చేశారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ను చూడలేమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. దాని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ లెక్కన విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఎవరు, ఎలా, నెరవేరుస్తారో చెప్పాల్సిన అవసరం ఉందని బాబు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలన, వ్యవసాయంపై రెండు టాస్క్ ఫోర్సులు వేయమని కోరామని ఆయన తెలిపారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం తక్కువగా ఉంటే, తెలంగాణలో ఆదాయం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ప్రధాని చొరవ తీసుకుని మూడు ఉపసంఘాలు నియమించారని ఆయన చెప్పారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన