రేపు పదవీ విరమణ చేయనున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు పదవీ విరమణ చేయనున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ పదవీకాలం రేపటితో ముగియనుంది. 1973 బ్యాచ్ అధికారి అయిన సంపత్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందినవారు. 2009లో ఈసీగా ఎన్నికైన సంపత్ సీనియర్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశారు. అనంతరం, 2012లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శిగా కూడా సంపత్ పదవీ బాధ్యతలను నిర్వహించారు. అత్యంత కీలకమైన 2014 సార్వత్రిక ఎన్నికలు సంపత్ ఆధ్వర్యంలోనే జరిగాయి.

More Telugu News