ఘనంగా ముగిసిన నాట్య సమ్మేళనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఘనంగా ముగిసిన నాట్య సమ్మేళనం

హైదరాబాదులో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ఘనంగా ముగిసింది. గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన మొత్తం 6327 మంది నాట్య కళాకారులు పాల్గొన్నారు. ఇంతమంది కళాకారులు పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఈ కార్యక్రమాన్ని తిరిగి 2016లో కృష్ణా జిల్లాలో నిర్వహిస్తామని, ఆ ఏడాది డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో నాట్య సమ్మేళనం ఉంటుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.

More Telugu News