విడుదలకు ముందే పాటలు లీక్...మడోనా ఆగ్రహం
ప్రఖ్యాత పాప్ సింగర్ మడోనా 13వ ఆల్బమ్ లోని పాటలు విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. మడోనా రాబోయే ఆల్బమ్ 'రెబల్ హార్ట్స్' నుంచి 14 పాటలను డిసెంబర్ 23 రాత్రి కొందరు దుండగులు తస్కరించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. దీంతో పాప్ సింగర్ మడోనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా ఒకరకమైన ఉగ్రవాదం లాంటిదని ఆమె పేర్కొన్నారు. లీక్ అయిన పాటలు వినకుండా ఉన్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.