బాలచందర్ మృతితో దిగ్భ్రాంతి చెందిన తమిళ, తెలుగు సినీ పరిశ్రమ
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ మృతితో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతి చెందాయి. అనారోగ్యం నుంచి ఆయన కోలుకుంటున్నారన్న వార్తలతో కాస్త తెప్పరిల్లిన తమకు ఆయన మరణ వార్త పిడుగుపాటని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. భవిష్యత్ లో బాలచందర్ లాంటి దర్శకులు రూపొందే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. దక్షిణాది సినీ రంగాన్ని బాలచందర్ మలుపుతిప్పారని పలువురు పేర్కొన్నారు. వెండి తెరతోనే ఆయన ప్రస్థానం ఆగలేదని, బుల్లితెరపై కూడా ఆయన తనదైన ముద్రవేశారని వారు తెలిపారు.