Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తేనే వైకుంఠ ఏకాదశి పాస్ లు చెల్లుతాయట

కొత్త ఏడాది తొలిరోజున వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలకు వచ్చే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరికి ఆరుపాసులు ఇస్తున్నట్టు ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సదరు ప్రజాప్రతినిధి లేదా వారి సతీమణి కానీ వ్యక్తిగతంగా హాజరైతేనే పాసులు చెల్లుబాటవుతాయని స్పష్టంచేశారు. లేదంటే వారి పిల్లలను కూడా పాసులమీద అనుమతించబోమని అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో చెప్పారు.

More Telugu News