ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఈ సారి తన విమర్శలకు మరింత పదును పెట్టారు. కేరళ పర్యటనలో భాగంగా బుధవారం తిరువనంతపురంలో మాట్లాడిన సందర్భంగా ఆయన మోదీ సర్కారు వైఖరిని తీవ్ర స్థాయిలో దునుమాడారు. ‘‘దేశం తగలబడిపోయినా ఫరవా లేదు... వారికి మాత్రం అధికారం కావాలి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ వాస్తవ దృక్పథం బోధపడిందని తన పార్టీ కార్యకర్తలకు చెప్పిన రాహుల్ గాంధీ, ‘‘వారి ఏకైక లక్ష్యం అధికారం చేజిక్కించుకోవడమే. ప్రజలు పోరాడినా ఫరవా లేదు. రక్తపాతం జరిగినా పట్టింపు లేదు. చివరకు దేశం యావత్తు తగలబడిపోయినా వారికి అనవసరం. వారికి కేవలం అధికారం మాత్రమే కావాలి’’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని రాహుల్ ‘‘మోదీకి ప్రజలు ఓ అవకాశమిచ్చారు. అయితే ఈ ఆరు నెలల కాలంలో ఆయన ఏం చేశారని ప్రశ్నించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉద్యోగాలు ఎక్కడ? అభివృద్ధి ఎక్కడ? అనే ప్రశ్నలు మోదీకి ఎదురుకానున్నాయి’’ అని హెచ్చరించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన