పాకిస్థాన్ లో తన ప్రాంతమైన స్వాత్ లోయ ఎంతో అందమైన పర్యాటక ప్రాంతమని నోబెల్ పురస్కారగ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ పేర్కొన్నారు. ఒస్లోలో ఆమె మాట్లాడుతూ, అంత అందమైన స్వాత్ లోయ తీవ్రవాదుల స్థావరమైపోయిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సమాన హక్కులుండాలని ఆమె ఆకాంక్షించారు. జీవితాలను ప్రభావితం చేసే పుస్తకాల కంటే సులువుగా ప్రాణాలు హరించే తుపాకులు దొరకడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రపంచం విద్య ఆవశ్యకతను గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. తన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇస్లాంకు తప్పుడు భాష్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నోబెల్ పురస్కారం ద్వారా వచ్చిన మొత్తాన్ని మలాలా ఫౌండేషన్ కు అందజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
బాల్య వివాహాలు అంతరించిపోవాలని ఆమె ఆకాంక్షించారు. దేశంలో ఉన్న ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య అందాలని ఆమె పిలుపునిచ్చారు. తమ ఊర్లో ఇప్పటికీ స్కూలు లేదని ఆమె తెలిపారు. తనలాంటి బాలలంతా ఇప్పుడు విద్యను కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన