దేశీయ క్రీడా రంగాల్లో పుట్టుకొస్తున్న లీగ్ లపై బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ప్రతిభను కనబరిచేందుకు లీగ్ లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. 72 ఏళ్ల ఈ నటుడు ఇటీవల ఢిల్లీలో ఐపీటీఎల్ ఆటగాళ్లను కలిశాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలను ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఇటువంటి ఆటల కార్యక్రమాలు జాతీయ సమగ్రతకు దోహదం చేస్తున్నాయని చెప్పాడు.
"దేశవ్యాప్తంగా క్రీడా లీగ్ లు అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణను ఎప్పుడూ చూడలేదు! ఈ లీగులన్నీ ప్రతిభ నిరూపించుకునేందుకు ఓ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశంలో అందరి మధ్య సమన్వయాన్ని తీసుకొస్తున్నాయి" అని బచ్చన్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. కాగా, చదువుకు తొలి ప్రాధాన్యత ఇచ్చే రోజులు పోయాయంటున్నాడు. తమ కాలంలో చదువు ముందు, ఆటలు తరువాత అనేవారని, ప్రస్తుత కాలంలో ఆటలే ముందంటూ, తరువాతే చదువు విషయానికి వస్తున్నారని పేర్కొన్నాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన