స్వర్గలోకపు ప్రవేశానికి ఒక్కో టికెట్ ను రూ.1 లక్షకు విక్రయించిన బాబా రాంపాల్ వద్ద ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేదట. అయినా జైల్లో ఉంటే ఆయన వద్ద డబ్బెలా ఉంటుందని లాజిక్ తీయకండి. ఎందుకంటే, జైలులో ఉన్న ఆయనకు ఖర్చులేమీ లేవు కాని బెయిల్ కోసమైనా డబ్బు కావాల్సిందేగా. ప్రస్తుతం తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను అడ్డగించిన కేసులో కోర్టు రాంపాల్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనకు జామీను ఇచ్చి బయటకు తీసుకెళ్లేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదట. అసలు జామీను విలువెంతో తెలుసా, కేవలం రూ.20 వేలు మాత్రమే.
కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టిన రాంపాల్ వద్ద రూ.20 వేలు కూడా లేవా అంటే, లేవట మరి. అందుకే ఆయన బెయిల్ లభించినా జైల్లోనే గడుపుతున్నారట. ఇదిలా ఉంటే, అధికారులను అడ్డగించిన కేసులో బెయిల్ మంజూరైనా, రాంపాల్ మీద ఇతర సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే, ప్రస్తుతం మంజూరైన బెయిల్ పై రాంపాల్ విడుదలైనా మళ్లీ అరెస్ట్ కావడం ఖాయం. ఈ నేపథ్యంలో అనవసరంగా డబ్బును తగలేయడం ఎందుకని బాబా రాంపాల్ రూ.20 వేలు లేవని చెబుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన