తాను విసిరిన బౌన్సర్ ప్రాణాలను బలిగొంటుందని ఆసీస్ యువ ఫాస్ట్ బౌలర్ షాన్ అబాట్ ఊహించి ఉండడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ బౌన్సర్ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ పాలిట మృత్యువులా పరిణమించింది. దీంతో, అబాట్ కొన్నిరోజుల పాటు అపరాధ భావనతో కుంగిపోయాడు. అయితే, ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లందరూ అతనికి బాసటగా నిలిచారు. "నీ తప్పేమీ లేదు, ఆటలో అలా జరిగిపోయిందంతే" అంటూ అనునయించారు.
ఈ నేపథ్యంలో, మరోసారి మైదానంలో అడుగుపెట్టాడీ యువ స్పీడ్ స్టర్. హ్యూస్ నేలకొరిగిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోనే బంతి పట్టాడు. న్యూ సౌత్ వేల్స్-క్వీన్స్ లాండ్ జట్ల మధ్య షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ 13 ఓవర్ లో అబాట్ బౌలింగ్ కు దిగాడు. ఆ ఓవర్లో ఓ బౌన్సర్ కూడా విసిరి తన దృక్పథాన్ని చాటాడు. తొలి నాలుగు బంతులను డాట్ బాల్స్ గా విసిరి బ్యాట్స్ మన్ జో బర్న్స్ ను కట్టడి చేశాడు.
కాగా, ఈ మ్యాచ్ లో న్యూ సౌత్ వేల్స్ ఆటగాళ్లు హ్యూస్ కు నివాళిగా 'పీజేహెచ్ 707' అని ముద్రించి ఉన్న జెర్సీలను ధరించారు. న్యూ సౌత్ వేల్స్ జట్టుకు హ్యూస్ గతంలో ఓ సారి ప్రాతినిధ్యం వహించాడు. ఆ రాష్ట్రం తరపున ఆడిన 707వ క్రికెటర్ హ్యూస్ కావడంతో అదే నెంబర్ ను జెర్సీలపై ముద్రించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన