అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ల ప్రేమకథ వెండితెరకెక్కనుంది. ఈ మేరకు సౌత్ సైడ్, యూ విల్ సంస్థలు కసరత్తు ప్రారంభించాయి. అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా ప్రథమ పౌరుడి ప్రేమకథ అంటే విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించేదే కదా. మరి ఈ చిత్రంలో ఒబామా, మిషెల్ పాత్రల్లో నటించే అవకాశం ఎవరికి దక్కనుందన్న విషయంపైనా ఎనలేని ఉత్కంఠ నెలకొంది.
ఒబామా ప్రేమకథను చిత్రంగా తెరకెక్కించనున్న విషయాన్ని వెల్లడించిన ఆ రెండు నిర్మాణ సంస్థలు, నటుల విషయంలో మాత్రం జాగ్రత్తగా అడుగులేస్తున్నాయి. మిషెల్ యుక్త వయసు పాత్రకు టికా సంఫ్టర్ ను ఎంపిక చేసుకున్న ఆ సంస్థలు ఒబామా పాత్రకు నటుడిని వెదికే పనిలో పడ్డాయి. మరి ఈ అరుదైన అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూద్దాం.
యుక్త వయసులో ఉండగా బరాక్ ఒబామాతో మిషెల్ కలిసి షికాగోలో చూసిన తొలి చిత్ర ప్రదర్శనను ఈ చిత్రంలో హైలైట్ చేస్తారని సమాచారం. ఇక దర్శకత్వం విషయానికొస్తే, రిచర్డ్ టేన్ తాను సొంతంగా రూపొందించుకున్న స్క్రిప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ చిత్రానికి ట్రేసీ సింగ్, స్టెఫానీ అలైన్ లు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన