ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంతో కష్టపడ్డానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిద్రపోతున్న సమయం తప్ప మిగిలిన ప్రతి క్షణం ప్రజల కోసమే పని చేశానని అన్నారు. అయితే ఆ సమయమంతా ప్రజలదేనని తాను భావించానని ఆయన చెప్పారు. తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని సమస్యల వలయం నుంచి బయటపడెయ్యాలని భావించానని, అందుకే శక్తి వంచన లేకుండా కష్టపడ్డానని ఆయన తెలిపారు.
విదేశాలకు వెళ్లి కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేశానని అన్నారు. రాజధాని నిర్మాణంపై సింగపూర్ తో ఒప్పందం చేసుకున్నానని ఆయన చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన బృహత్ ప్రణాళిక ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సింగపూర్ కు సంబంధించిన పలు పరిశ్రమలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయని ఆయన తెలిపారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన