: రజనీ సార్ పుట్టిన రోజుకు బహుమతే లింగా!: కేఎస్ రవికుమార్

రజనీ సార్ పుట్టిన రోజు కానుకగా లింగా సినిమా నిలిచిపోతుందని ఆ సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ తెలిపారు. హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో జరిగిన లింగా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, లింగా సినిమా ద్వారా తనకు ఎంతో మంది ఆత్మీయులు దొరికారని అన్నారు. జగపతిబాబులాంటి సోదరుడు, తండ్రి లాంటి విశ్వనాథ్ గారు, సోదరిలు అనుష్క, సోనాక్షి లు తనకు ఎంతో నచ్చారని అన్నారు. సినిమా షూటింగ్ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో జరిగిపోయిందని ఆయన చెప్పారు. సినిమా యూనిట్ మొత్తానికి ధన్యవాదాలని, రజనీసార్ సినిమా అంటేనే కన్నుల పండుగగా ఉంటుందని ఆయన తెలిపారు.

More Telugu News