కృష్ణ జిల్లా చల్లపల్లి పరిధిలో గురురూప రాక్షసుల ఘాతుకం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వక్కలగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాం ప్రసాద్, మరో ఉపాధ్యాయుడు జనార్ధన్ ప్రసాద్ లు ఓ విద్యార్థినిపై చాలాకాలం పాటు లైంగిక దాడికి పాల్పడటమే కాక, సదరు విద్యార్థి అకాల మృతికి కారణమయ్యారు. తమ లైంగిక దాడి నేపథ్యంలో మూడు సార్లు గర్భం దాల్చిన విద్యార్థినికి వారు అబార్షన్ చేయించారు. పిన్న వయసులోనే మూడుసార్లు అబార్షన్ కావడంతో ఆ బాలిక 15 రోజుల క్రితం మృత్యువాత పడింది.
అయితే, ఈ విషయం బయటకు పొక్కకుండా సదరు రాక్షసులు జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు రోజుల క్రితం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఆదివారం పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో, చిన్న పిల్లలపై అకృత్యాలకు పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. ఇక, వారి ప్రోద్బలంతో బాలికకు అబార్షన్ చేసిన వైద్యశాలపైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.
ఇదిలా ఉండగా, విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టిన ప్రధానోపాధ్యాయుడు శివరాంప్రసాద్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి నుంచి అవార్డు పొందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని అవార్డును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన