యువత తప్పుడు మార్గాల్లోకి చాలా సులువుగా దారి మళ్లుతున్నారు. జల్సాలు, అమ్మాయిల మోజులో పడి నిండుజీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. పబ్బుల్లో, క్లబ్బుల్లో అమ్మాయిలతో షికార్ల కోసం సుమన్ (25) అనే ఇంజనీరింగ్ పట్టభద్రుడు చోరీల బాటపట్టాడు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీకి చెందిన సుమన్ విలాసాలకు అవసరమైన డబ్బులేకపోవడంతో జూబ్లిహిల్స్ లోని దసపల్లా హోటల్ వ్యాలెట్ పార్కింగ్ లోని డ్రా నుంచి ఓ కారు తాళం తీసుకుని ఉడాయించాడు.
అది ఓ అడ్వొకేట్ కు చెందిన బీఎండబ్ల్యూ కారు. అతను తన పని ముగించుకుని వచ్చి చూసేసరికి తన కారు కనబడలేదు. దీంతో షాక్ అయిన ఆ అడ్వొకేట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్ లోని సీసీ కెమేరా పుటేజీ పరిశీలించారు. దీంతో సుమన్ నిర్వాకం బట్టబయలైంది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు.
దీంతో గతంలో బేగంపేట బాటిల్స్ అండ్ చిమ్నీస్ వ్యాలెట్ పార్కింగ్ లో కూడా రెండు కార్లు దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. చోరీ చేసిన కార్ల నెంబర్ ప్లేట్లు మార్చి అమ్మాయిలతో షికార్లు చేయడం, పబ్బులు, క్లబ్బుల్లో జల్సా చేయడం కోసం కార్లు చోరీ చేశానని సుమన్ పేర్కొన్నాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన