పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐ అండతో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కరడుగట్టిన ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరోసారి భారత్ మీద అక్కసును వెళ్లగక్కాడు. కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పాకిస్థానీలు కృషి చేయాలని పిలుపునిచ్చాడు. "ఆఫ్ఘనిస్థాన్ లోని అమెరికా బలగాలకు తోడ్పడేందుకు ఇండియా తన సైన్యాన్ని పంపిస్తున్నప్పుడు... కాశ్మీర్ లోని మన సోదరులకు సహాయం చేసేందుకు ముజాహిదీన్ లు కాశ్మీర్ కు వెళ్లడంలో తప్పులేదు. జీహాదీలకు కాశ్మీర్ వెళ్లే హక్కు ఉంది. కాశ్మీరీల పిలుపు మేరకు అక్కడకు వెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది" అంటూ పాకిస్థానీల మదిలో భారత్ వ్యతిరేక భావజాలాన్ని నింపే ప్రయత్నం చేశాడు. లాహోర్ లోని చరిత్రాత్మక ప్రాంతమైన మినార్-ఏ-పాకిస్థాన్ మైదానంలో జరుగుతున్న జమాత్ ఉద్ దవా సభలో ప్రసంగిస్తూ సయీద్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, అనుచరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సయీద్ మాట్లాడుతూ, ప్రేమను పంచాలనుకుంటున్న మన మాటలను ఇండియా వినకపోతే... కాశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం పొందేందుకు పూర్తిగా సహకరించాలని ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెబుతామని అన్నాడు. మరో దారుణ విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమానికి జనాలను తరలించడం కోసం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రెండు ప్రత్యేక రైళ్లను నడిపిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను అమెరికా, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాయి. ఇందులో భాగంగా సయీద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. సయీద్ ను అరెస్ట్ చేయాలంటూ పాక్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా, సయీద్ పాక్ వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తూ, బహిరంగ సభలను కూడా నిర్వహిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన