స్పైస్ జెట్ కు డీజీసీఏ షాక్ ఇచ్చింది. స్పైస్ జెట్ తీరు అనుమానాస్పదంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించడంతో డీజీసీఏ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఎయిర్ పోర్టులు, ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు, ఆయిల్ కంపెనీలు, సేవా సంస్థలకు చెల్లించాల్సిన 1500 కోట్ల రూపాయలను నెల రోజుల్లో చెల్లించాలని డీజీసీఏ ఆదేశించింది.
నెల రోజుల వరకు బుకింగ్ నిలిపేసి, గతంలో బుకింగ్ చేసుకుని సర్వీసులు రద్దు చేసిన ప్రయాణికులకు డబ్బు చెల్లించాలని స్పైస్ జెట్ కు డీజీసీఏ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా స్పైస్ జెట్ కోసం కేటాయించిన 186 స్లాట్స్ రద్దుచేయాలని ఎయిర్ పోర్ట్స్ అధారిటీకి డీజీసీఏ సూచించింది. ఇప్పటివరకు పేరుకున్న ఉద్యోగుల వేతన బకాయిలను పది రోజుల్లోగా చెల్లించాలని స్పైస్ జెట్ కు డీజీసీఏ ఆదేశించింది.
అలాగే అంతా పూర్తయిన తరువాత సంస్థలోని ఉద్యోగులు, సంస్థ విమానాలు నడిపే షెడ్యూల్ తో స్పూర్తి దాయకమైన పూర్తి వివరాలు అందించాలని డీజీసీఏ స్పైస్ జెట్ కు స్పష్టం చేసింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన