జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడులపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పాక్ ఉగ్రవాదుల తీరును ఆయన ఖండించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని ఆయన సూచించారు. పాకిస్థాన్ కు అలా చేయడం చేతకాకపోతే భారత్ సహాయం కోరవచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఉగ్రవాదులను అణచివేయడంలో భారత్ ఉపేక్షించదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రదాడులను ఆపకుండా, వారిని ప్రోత్సహిస్తూ ఉంటే తాము చూస్తూ ఊరుకోమని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.