ఉత్తరాది రాష్ట్రాల్లో నానాటికీ బలోపేతమవుతున్న మావోయిస్టులను అణచివేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మావోలను సమూలంగా నిర్మూలించడంలో గడచిన పదేళ్లలో ఏపీలో గణనీయ ఫలితాలు నమోదయ్యాయి. ఇందులో, ఏపీలో ప్రత్యేకంగా రూపొందించిన గ్రేహౌండ్స్ విభాగం కీలక భూమిక పోషించిందనే చెప్పాలి. ఈ విభాగాన్ని అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి దుర్గాప్రసాద్ కే దక్కుతుంది. మొన్నటిదాకా ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీ చీఫ్ గా కొనసాగిన దుర్గాప్రసాద్ ను అక్కడి నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా పరిధిలో మావోల దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 14 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టులను ఏరివేయడమే కాక సీఆర్పీఎఫ్ ను మరింత బలోపేతం చేసే బాధ్యతలను దుర్గాప్రసాద్ కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్ ను దుర్గాప్రసాద్ తీర్చిదిద్దిన వైనాన్ని హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారట. దుర్గాప్రసాద్ అయితేనే మావోలను సమర్ధవంతంగా ఎదుర్కోగలరని కూడా ఆయన భావిస్తున్నారు. రాజ్ నాథ్ సూచనల మేరకే కేంద్రం ఆయనను సీఆర్పీఎఫ్ డీజీగా నియమించింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన