అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ పూజా, ఆర్తీలకు ప్రకటించిన నగదు పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్కాచెల్లెళ్ళ ప్రవర్తనపై పలు సందేహాలు ఉన్నాయని, తమకు కొట్టడం అలవాటని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారని, వీరు చెబుతున్న విషయాల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునేంత వరకూ బహుమతి నిలిపివేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
తొలుత, ఒక బస్సులో ముగ్గురు యువకులను వీరు ఎదుర్కొంటున్న వీడియో నెట్ లో హల్ చల్ చేయగా, ఆ వెంటనే మరో వీడియో కూడా బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలలో వీడియోను ఎవరు షూట్ చేశారన్న విషయాన్ని ఇంతవరకూ పోలీసులు కనుక్కోలేకపోయారు. వీరు యువకులకు బుద్ధి చెబుతున్న సన్నివేశాలను చిత్రీకరించినవారు అంతకు కొద్ది క్షణాల ముందు జరిగిన వేధింపులను ఎందుకు షూట్ చేయలేదని ఎంతో మంది సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో ప్రశ్నలు కురిపించారు.
కాగా, బస్సులో పోకిరీలుగా ముద్రపడి ఉద్యోగార్హత కోల్పోయిన ముగ్గురు యువకులూ మంచివారని వారి స్వగ్రామం వెనకేసుకొచ్చింది. పైగా, బస్సులో తీసిన వీడియోలో కనిపించిన ఓ పెద్దావిడ వారు ఎవరినీ వేధించలేదని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పూజా, ఆర్తీలకు తగిన సహకారం అందించలేదంటూ సస్పెన్షన్ కు గురైన బస్సు డ్రైవర్ ను విధుల్లో చేరమని అధికారులు ఆదేశించారు. ఈ అక్కాచెల్లెళ్ళ గురించి ఇంకేమి వినాల్సి వస్తుందో?
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన