రూ. 50 వేల లోపు రుణాలున్న రైతులకు ఈ నెల 10వ తేదీన రుణమాఫీ జరుగుతుందని, ఆ తరువాత ఏ బ్యాంకు కూడా వారిని రుణం చెల్లించాలని అడగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే దిశగా ఎన్ని కష్టాలు ఎదురైనా అర్హులైన అందరికీ రుణమాఫీ అమలు చేసి తీరుతామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర మంత్రులతో నేటి ఉదయం సమావేశం అనంతరం రుణమాఫీపై ఆయన విధాన ప్రకటన చేశారు. గత పదేళ్లుగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అర్హులైన ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తున్నామని తెలిపారు.
నిబంధనలకు అనుగుణంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న రైతులందరికీ రుణాలు మాఫీ అయినట్టేనని వివరించారు. ఆధార్, రేషన్ కార్డులు సమర్పించని వారికి 4 వారాల గడువు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒకే వ్యక్తి పలు చోట్ల రుణమాఫీకి దరఖాస్తు చేసుకోరాదనే నిబంధనలు కొంత కఠినం చేశామని బాబు పేర్కొన్నారు. ఒక కుటుంబానికి రూ. 1.50 లక్షల రూపాయల సీలింగ్ విధించినట్టు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశామని వివరించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన