తాము అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఆయుధాలు ధరించివచ్చిన మావోయిస్టులు ఓ నిర్మాణ రంగ సంస్థపై దాడి చేసి ఎనిమిది యంత్రాలను, ఓ వాహనాన్ని అగ్నికి ఆహుతి చేసిన ఘటన బీహార్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముజఫర్ పూర్ జిల్లాలోని బగారా ఘాట్ లోని ఓ ప్రైవేటు కంపెనీ నిర్మాణాలు చేపడుతున్న స్థలంలోకి మావోయిస్టులు వెళ్లారు. అక్కడ ఉన్న యంత్రాలకు, ఉద్యోగుల పిక్ అప్ వాహనానికి నిప్పు పెట్టారు. వారు అడిగిన డబ్బు ఇవ్వలేదన్న కారణంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని ఎస్పీ రంజిత్ కుమార్ మిశ్రా వివరించారు. ఘటనా స్థలిలో మావోయిస్టులు పలు రౌండ్ల కాల్పులు జరిపారని, అయితే ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.