భారత్ తో తొలిటెస్టు (డిసెంబర్ 4-8) ఆడే కంగారూ జట్టును ఆసీస్ సెలక్టర్లు కాస్త ముందుగానే ఎంపిక చేయనున్నారు. వ్యూహాత్మకంగా చూస్తే అది సరైన నిర్ణయం కాకపోయినా, మార్కెటింగ్ ప్రయోజనాల కోసం తప్పడంలేదట. ఆసీస్ సెలెక్టర్ మార్క్ వా ఈ విషయం తెలిపాడు. ఫాక్స్ స్పోర్ట్స్ చానల్లో ప్రసారమైన ఓ క్రికెట్ షోలో ఈ మాజీ క్రికెటర్ మాట్లాడుతూ, తొలి టెస్టు కోసం రెండు వారాల ముందే జట్టును ఎంపిక చేస్తున్నామని వెల్లడించాడు. శనివారం నాడు సెలెక్షన్ కమిటీ సమావేశమై జట్టును ఎంపిక చేస్తుందని తెలిపాడు.
అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పెర్ఫార్మెన్స్ డైరక్టర్ పాట్ హోవార్డ్ మాట్లాడుతూ, మెరుగైన సన్నాహకాల కోసమే జట్టును ఎంతో ముందుగా ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఇంతకుముందు ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ కోసం ఇలాగే జట్టును ముందుగానే ఎంపిక చేశారని హోవార్డ్ గుర్తు చేశారు. ఆ సిరీస్ లో ఇంగ్లండ్ ను 5-0తో చిత్తుచేశామని వివరించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన