హైదరాబాద్ లో కలకలం రేపిన కాల్పుల ఘటనలో నిందితుడు అరెస్టయ్యాడన్న వార్తలను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఖండించారు. బుధవారం కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ గా గుర్తించారని, అనంతపురంలో అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నారని గురువారం ఉదయం నుంచి పలు వార్తా ఛానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఈ వార్తలను పోలీస్ కమిషనర్ ఖండించారు.
ఇదిలా ఉంటే, కాల్పులకు పాల్పడింది ఓబులేషేనని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు, అతడిని అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. బుధవారం రాత్రి కర్నూలు-అనంతపురం సరిహద్దుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓబులేష్ ను అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక అదుపులోకి తీసుకున్న ఓబులేష్ ను బుధవారం రాత్రే హైదరాబాద్ తరలించి రహస్య ప్రదేశంలో విచారణ మొదలుపెట్టారని సదరు వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబట్టేదాకా అరెస్ట్ ను ధ్రువీకరించరాదన్న భావనతోనే కమిషనర్ ఆ ప్రకటన చేసి ఉంటారన్న వాదనా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఓబులేష్ ది కడప జిల్లా పోరుమామిళ్లగా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన