ప్రజలు గమనిస్తున్నారు... తప్పుటడుగులు వేయకండి: మంత్రులను హెచ్చరించిన బాబు
ప్రజలు మనల్ని గమనిస్తున్నారు... తప్పుటడుగులు వేయకండని రాష్ట్ర మంత్రులకు సీఎం చంద్రబాబు హితవు పలికారు. మంత్రులు, హెచ్ వోడీల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బదిలీల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డబ్బులు చేతులు మారాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయానికే దాదాపు 150 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ప్రతి శాఖకు చెందిన వివరాలు తనవద్ద ఉన్నాయని అన్నారు. అవినీతి ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లో దరిచేరనీయరాదని సూచించారు.