అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్కుకు వెళ్లిన నిత్యానందరెడ్డిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడిలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడితో ఆయన కుటుంబం షాక్ కు గురైంది.
దాడిపై సమాచారం తెలుసుకున్న వెంటనే జగన్, నిత్యానందరెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా దాడి జరిగిన తీరు, నిందితుడి వివరాలను జగన్, ఆయనను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, దాడిపై సమాచారం తెలుసుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిత్యానందరెడ్డి కూడా ఒక నిందితుడిగా ఉన్నారు. అయితే, మిగిలిన నిందితుల్లా కాకుండా నిత్యానందరెడ్డి, జగన్ సంస్థల్లో తన పెట్టుబడులను సమర్ధించుకుంటున్నారు. లాభాలు ఆశించే జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టానని, వైఎస్ సర్కారు నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని ఆయన కోర్టులో న్యాయపోరాటం సాగిస్తున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన