తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. పింఛన్లు అందక హఠాన్మరణానికి గురవుతున్న వృద్ధులపై కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ, వైద్య సేవలపై బీజేపీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, భూపంపిణీపై వైసీపీ, యావజ్జీవ శిక్ష పడ్డ ఖైదీల విడుదలపై సీపీఐ, మధ్యాహ్న భోజన బిల్లుల జాప్యంపై సీపీఎం స్పీకర్ కు వాయిదా తీర్మానాలను అందజేశాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సమావేశాల్లో వీటిపై స్పీకర్ ప్రకటన చేస్తారు.