భారత బ్యాడ్మింటన్ రంగానికి అంతర్జాతీయ క్రీడా యవనికపై సమున్నత గుర్తింపు తెచ్చిన క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఈ హైాదరాబాదీ షట్లర్ సాధించిన విజయాల స్ఫూర్తిగా బాలలు ఎందరో బ్యాడ్మింటన్ బాటపట్టారంటే అతిశయోక్తి కాదు. గాయాల నుంచి కోలుకున్న సైనా గత కొంతకాలంగా ఫామ్ కనబరుస్తోంది. తాజాగా, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ చేజిక్కించుకుని సత్తా చాటింది. చైనా గడ్డపై సాధించిన ఈ విజయాన్ని సైనా ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి!
ఫైనల్ మ్యాచ్ లో జపాన్ అమ్మాయి యమగుచిని చిత్తు చేసిన అనంతరం సింపుల్ గా ఓ వెనిల్లా ఐస్ క్రీమ్ లాగించేసింది. ఐస్ క్రీమ్ లను బాగా ఇష్టపడే సైనా, మ్యాచ్ ఫిట్ నెస్ కోసం టోర్నీల్లో వాటికి దూరంగా ఉంటుంది. టైటిల్ గెలిచిన ఆనందంలో ఆరోగ్య సూత్రాలన్నింటిని పక్కనబెట్టి మనసుకు నచ్చిన ఐస్ క్రీమ్ ను ఆరగించింది.
కాగా, సైనా చైనా ఓపెన్ గురించి మాట్లాడుతూ, తొలుత ఈ టోర్నీలో ఆడకూడదని భావించానని, ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత సమయం తక్కువగా ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. అయితే, కోచ్ విమల్ ఒప్పించడంతో చాంపియన్ షిప్ బరిలో దిగానని వెల్లడించింది. ఇక, తన జీవితచరిత్రను తెరకెక్కిస్తే ఎవరైతే తన పాత్రకు బాగుంటారో కూడా చెప్పేసిందీ హైదరాబాదీ స్టార్. తడుముకోకుండా 'దీపికా పదుకొనే' అంటూ బదులిచ్చింది. దీపిక అయితే అతికినట్టు సరిపోతుందని, ఆమె గతంలో జాతీయస్థాయిలో బ్యాడ్మింటన్ ఆడిందని సైనా వివరించింది. అంతే కాదండోయ్, తన బయో పిక్ లో దీపికకు జతగా షారుఖ్ అయితే ఓకే అని అభిప్రాయపడింది. వారిద్దరూ హిట్ పెయిర్ అని పేర్కొంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన