వివాదాస్పద స్వామి బాబా రాంపాల్ అనుచరులు హిసార్ లోని ఆశ్రమం వద్ద మంగళవారం పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. బాబాను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపైకి తిరగబడ్డ రాంపాల్ గూండాలు ఏకంగా కాల్పులకూ దిగారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినా బాబా భక్తులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. మహిళా భక్తులు కూడా పోలీసులపైకి తిరగబడ్డారు. దీంతో పోలీసులు కూడా కాస్త కటువుగానే వ్యవహరించారు.
టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించిన పోలీసులు, రబ్బరు బుల్లెట్లను కూడా ప్రయోగించారు. కొంత మంది పోలీసులు బయట భక్తులతో పోరు సాగిస్తుండగా, మరికొందరు ఆశ్రమం లోపలికి వెళ్లినట్లు సమాచారం. అసలు లోపల ఏం జరుగుతోందన్నది తెలియరావడం లేదు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. హైకోర్టు కఠిన ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు ఎటు తిరిగి రాంపాల్ ను అరెస్ట్ చేయాల్సిందేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని బలగాలను అక్కడికి రప్పిస్తున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన