నిన్నటికి నిన్న కాంగ్రెస్, వామపక్షాలతో వేదికను పంచుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం మరో సంచలన ప్రకటన చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు వామపక్షాలతో జతకట్టేందుకూ వెనుకాడబోమని ఆమె ప్రకటించారు. మంగళవారం ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ మేరకు ప్రకటించిన ఆమె, దేశవ్యాప్త చర్చకు తెర తీశారు. నిన్నటిదాకా పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం అలుపెరుగని రీతిలో వామపక్షాలపై పోరు సాగించిన ఆమె, తాజాగా అదే పార్టీతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించడంపై రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోతున్నారు.
మతతత్వ రాజకీయ శక్తులను అణచివేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆమె, అదే భావనతో ఉన్న వామపక్షాలతో కలిసి పోరు సాగించనున్నామని ప్రకటించారు. ఈ విషయంలో తమ రెండు పార్టీల మధ్య సారూపత్య ఉందని మమత వెల్లడించారు. వామపక్షాలతో సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ, మతతత్వ శక్తులపై సాగించనున్న పోరులో మాత్రం కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే మమత ఆఫర్ ను స్వీకరించబోమని సీపీఎం నేత మొహమ్మద్ సలీం పేర్కొనడం గమనార్హం.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన