ఆస్ట్రేలియా నుంచి వచ్చే పర్యాటకులకు భారత్ లో కాలు మోపగానే వీసాను మంజూరు చేసే సదుపాయాన్ని కల్పించనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఎక్కువ మంది విదేశీయులను ఇండియాకు రప్పించవచ్చని ఆయన అన్నారు. తన పర్యటనలో ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రవాస భారతీయులు చూపిన ఆదరణను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మోదీ తెలిపారు.