రేపు బెంగళూరుకు ఏపీ సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు బెంగళూరుకు ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక నుంచి రాయలసీమకు రావాల్సిన 32 టీఎంసీల సాగు, తాగు నీటి విడుదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆయన చర్చలు జరపనున్నారు. అంతేకాక ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించనున్నారు. గత వారం ఇదే విషయంపై బెంగళూరు వెళ్లిన చంద్రబాబునాయుడుకు సిద్ధరామయ్య అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని సంగతి తెలిసిందే.

More Telugu News