ఏపీలో సంచార రైతు బజార్లు: మంత్రి పుల్లారావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో సంచార రైతు బజార్లు: మంత్రి పుల్లారావు

రైతు బజార్లకు అనుబంధంగా సంచార రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. బుధవారం సహచర మంత్రులు పరిటాల సునీత, నారాయణ, గంటా శ్రీనివాసరావులతో కలసి ఆయన విశాఖ ఎంవీపీ కాలనీ రైతు బజార్ ను ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 84 రైతు బజార్లకు అనుబంధంగా 250 సంచార రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. తద్వారా 250 మందికి ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. సంచార రైతు బజార్ల కోసం అవసరమయ్యే వాహనాలను ప్రభుత్వమే సబ్సీడీ కింద లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. రైతు బజార్లలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పిన ఆయన, కూరగాయల నిల్వ కోసం రైతు బజార్లలోనే కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంవీపీ కాలనీ రైతు బజారును రాష్ట్రంలోనే మోడల్ రైతు బజార్ గా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు.

More Telugu News