అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ విందు సమావేశంలో పాల్గొననున్న కేసీఆర్
నవంబర్ 26న హైదరాబాదులో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాదులో తాము నిర్వహించే విందుకు హాజరుకావాలని ఆమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కేసీఆర్ ను ఆహ్వానించగా, ఆయన ఆమోదించినట్టు అధికారులు తెలిపారు. 1992లో ఏర్పాటయిన ఈ సంస్థలో అమెరికాలో 73 రంగాలకు చెందిన 500 ప్రముఖ కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆయా సంస్థలు భారతదేశంలోని వివిధ పట్టణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా ఛాంబర్ ఆప్ కామర్స్ హైదరాబాదులో విందు సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భాన్ని కేసీఆర్ వినియోగించుకోనున్నారని, ఆ విందు సమావేశంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు అవలంబిస్తున్న విధానాలు, ఇస్తున్న రాయితీలను వివరించి, ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.