Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో రూ.5 కోట్లు ఇవ్వాలని ఇన్ఫోసిన్ ను అడిగా!: ఏపీ సీఎం

తుపాను బాధితులకు ఇన్ఫోసిస్ సంస్థ రూ.ఐదు కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అందుకే మరో ఐదు కోట్లు ఇవ్వాలని ఇన్ఫోసిన్ సుధామూర్తిని అడిగినట్లు మీడియా ముఖంగా చెప్పారు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కార్పోరేట్ సంస్థలు తీసుకోవాలని బాబు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఏపీఎన్జీవోలు విరాళంగా ప్రకటించిన రెండు రోజుల వేతనం రూ.125 కోట్ల చెక్కును ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చంద్రబాబుకు అందించారు. కాగా, విశాఖలో 70 శాతం విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అంతకుముందు సీఎం చెప్పారు. శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో నగరంలో పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. ఇప్పుడెక్కడా పెట్రోలు, డీజిల్ పై ఫిర్యాదు లేదని, ఇవాళ మరింత ఎక్కువ నీరు అందించాలని అనుకుంటున్నామనీ అన్నారు. ఇంకా పలుచోట్ల చెట్లను తొలగించాల్సి ఉందన్నారు.

More Telugu News