వరల్డ్ కప్ వరకు ధోనీనే కెప్టెన్ గా ఉంచండి...రెండోది కూడా తెస్తాడు: గంగూలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరల్డ్ కప్ వరకు ధోనీనే కెప్టెన్ గా ఉంచండి...రెండోది కూడా తెస్తాడు: గంగూలీ

వచ్చే ప్రపంచకప్ వరకు టీమిండియాకు ధోనీనే కెప్టెన్ గా కొనసాగించాలని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, ధోనీని కెప్టెన్ గా వరల్డ్ కప్ వరకు కొనసాగిస్తే రెండో వరల్డ్ కప్ సాధించి పెడతాడని అన్నారు. విదేశాల్లో టీమిండియా ప్రదర్శనపై ఆందోళన చెందాల్సిన పని లేదని, వరల్డ్ కప్ లోపు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ లు ఉన్నాయని, అప్పటికల్లా ఆటగాళ్లు గాడినపడతారని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు ప్రణాళికలు రచించుకోవాలని ఆయన సూచించారు.

More Telugu News