మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటు?

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు పొత్తుల విషయంలో కత్తులు దూసుకున్నాయి. దీంతో, 25 ఏళ్లుగా ఉన్న బీజేపీ, శివసేనల బంధం... 15 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీల బంధం తెగిపోయాయి. ఈ నేపథ్యంలో, మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ, ఎన్సీపీ, ఎంఎన్ఎస్ లతో పాటు కొన్ని చిన్న పార్టీలు కలసి ఓ కూటమిగా ఏర్పడనున్నాయని సమాచారం. అయితే నామినేషన్లు వేయడానికి శనివారమే చివరి తేదీ కావడంతో... ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాధ్యమవుతుందా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ, ఎంఎన్ఎస్ నేతలు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని సమాచారం.

More Telugu News