చంద్రబాబుపై అలిపిరి దాడి కేసులో దోషులకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరి బాంబు దాడి కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి తిరుపతి అదనపు సహాయ జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఘటనలో దోషులైన రామచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రలకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది. దీనికి తోడు, రూ. 5000 జరిమానా విధించింది.