తమతో ఫోటోలు దిగమంటూ బాలికలపై కత్తులతో దాడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమతో ఫోటోలు దిగమంటూ బాలికలపై కత్తులతో దాడి

తమతో ఫోటోలు దిగాలంటూ ముసుగు ధరించి వచ్చిన ఐదుగురు దుండగులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోకి చొరబడి ఇద్దరు బాలికలపై కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గాయపడిన బాలికలను ఉపాధ్యాయులు అంబాయ్ ప్రభుత్వాసుపత్రికి ఉపాధ్యాయులు తరలించారు. తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన ఈ దారుణంపై ఆందోళన రేగింది. దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో కడలూరు-పొత్తపాతూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు, వారం రోజులుగా బాలికలను కత్తులతో బెదిరించి అల్లరి పెడుతున్న ఐదుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తమతో సెల్ఫోన్ లో ఫోటోలు దిగాలని బాలికలను వేధించారని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న ముగ్గురు దుండగుల్లో ఇద్దరు బాలికలపై దాడికి పాల్పడివుంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News