తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న వరద ముప్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న వరద ముప్పు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరద ముప్పు తప్పేలా లేదు. ఆదివారం సాయంత్రం సమయానికి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు వరద నీటిని కిందకు వదులుతున్నారు. ఒకేసారి భారీ స్థాయిలో వరద నీటిని కిందకు వదులుతుండటంతో దిగువ భాగాన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నాగావళి, వంశధార ప్రాజెక్టులను వరద నీరు ముంచెత్తుతోంది. రెండు ప్రాజెక్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టుల దిగువ భాగాన ఉన్న వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు వరద ముప్పును నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

More Telugu News