మోడీ సర్కార్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెచ్చుకున్నారు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ) ప్రవాహాన్ని పెంచే దిశగా మోడీ సర్కార్ తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. దేశంలో పేదరికం తగ్గించాలంటే దేశ ఆర్థికవృద్ధి రేటును 8 నుంచి 9 శాతం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలో పొదుపుచర్యలు పాటించడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి, విదేశీ పెట్టుబడులను పెంచే విధంగా మోడీ సర్కార్ తీసుకున్న చర్యలు హర్షణీయమని ఆయన అన్నారు.
ఇక రాష్ట్రపతిగా రాజ్యాంగపరమైన బాధ్యతల కారణంగా సమావేశాల్లో ఇతరులు చెప్పింది వినడమే తప్ప, ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాని ప్రణబ్ అన్నారు. రెండేళ్ల క్రితం వరకు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించానని... ఇప్పుడు రాష్ట్రపతి పదవిలో ఉన్న కారణంగా వాటిపై చర్చలు జరుగుతున్నప్పుడు ఏమీ మాట్లాడలేకపోతున్నానని ఆయన అన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన