మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదిలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. జలాశయంలోకి వచ్చి చేరుతున్న వరద నీటికంటే దిగువకు వదులుతున్న నీటి పరిమాణం తక్కువగా ఉన్న నేపథ్యంలో క్షణక్షణానికి జలాశయంలో నీటి మట్టం పెరిగిపోతోంది. శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ఇప్పటికే 850 అడుగులకు పైగా నీరు చేరిపోయింది.
దిగువకు వదిలే నీటి పరిమాణాన్ని పెంచని పక్షంలో పోతిరెడ్డిపాడు పరిసర ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తుంగభద్రను ముంచెత్తిన వరద నీరు, కర్నూలు సమీపంలోని తుంగభద్ర బ్రిడ్జిపై నుంచి పారుతోంది. దీంతో రవాణావ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నష్టనివారణ చర్యలు తీసుకోని పక్షంలో గతంలోలా కర్నూలును వరద నీరు ముంచెత్తే ప్రమాదం లేకపోలేదు. గతానుభవాల నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు వాసులు ప్రాణాలరచేత పట్టుకుని కూర్చున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన