ఢిల్లీలో ప్రజాస్వామ్య పద్ధతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ధర్నాకు దిగనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ఈ ధర్నాలో పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పాల్గొననున్నారు. ఆమధ్య జరిగిన ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీకీ షాకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, పూర్తి మెజార్టీ రాని నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్, అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు. అంతేకాక ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాని నేపథ్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించడమొక్కటే మార్గమని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ప్రజలు అందించిన అధికారాన్ని కాపాడుకోలేని అసహాయ వ్యక్తిగా కేజ్రీవాల్ ను అభివర్ణించిన కాంగ్రెస్, బీజేపీలు రెండోమారు ఎన్నికలకు అంత సుముఖంగా లేవు. ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆప్ కార్యక్తల వైఖరిని ఖండిస్తున్నారు. ఐదేళ్లకోమారు జరగాల్సిన ఎన్నికలను ఏటా నిర్వహించడం ఎంతవరకు సబబని కూడా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన