ఎన్నో రకాల కార్యకలాపాలకు అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల ధృవీకరణ సంతకాలు కలిగిన పత్రాలను సమర్పించే సంప్రదాయం ఇప్పటిదాకా ఉంది. ఈ పద్ధతికి కేంద్ర ప్రభుత్వం మంగళం పలుకుతోంది. ఎవరికి వారే ధృవీకరణ పత్రాలను సమర్పించే పద్ధతిని అమలు చేసే దిశగా ప్రధాని మోడీ అడుగు వేశారు. అయితే, ఇలా స్వయంగా పత్రాలను సమర్పించే విషయంలో అవకతవకలకు పాల్పడితే పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల కింద నేరుగా కేసు నమోదు చేస్తారు.
అఫిడవిట్ల వాడకాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని, ఆయా వ్యక్తులు స్వయంగా అందించే పత్రాలనే స్వీకరించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు ఇప్పటికే సూచనలు అందాయి. స్వయంగా ధృవీకరణ పత్రాలను అందజేసినవారు... చివరి దశలో ఒరిజినల్స్ చూపిస్తే సరిపోతుంది. ఈ విషయం వల్ల సామాన్యులకు చాలా మేలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల సంతకాల కోసం సామాన్యులకు బోలెడంత సమయం వృథా కావడమే కాకుండా... డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి తోడు అధికారుల సమయాన్ని కూడా ఈ పద్ధతి వృథా చేస్తోంది. అందుకే, ఈ పద్ధతికి మంగళం పలికేందుకు కేంద్రం సిద్ధమైంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన