తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలపై వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆయన వైఖరి సరైంది కాదని కుండబద్దలు కొట్టారు. అమెరికాలాంటి దేశంలోనే 7 సంవత్సరాలు ఉంటే గ్రీన్ కార్డు ఇస్తున్నారని... అమెరికన్లతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. అలాంటిది తెలుగు గడ్డపైనే తెలుగువారిని పరాయివారుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 1956 ముందు ఉన్నవారే ఇక్కడివారని... తర్వాత నుంచి ఉన్నవారు ఇక్కడివారు కాదనే అంశం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ఇంకా మారలేదని... ఇంకా, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి పబ్బంగడుపుకోవాలనే ప్రయత్నిస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర అనే విద్వేషాలను ఇప్పటికీ పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మొన్నటిదాకా ఇక్కడి వారంతా తెలంగాణ వారే అన్న కేసీఆర్... ఇప్పడు మాట మార్చారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను ఇండియా, పాకిస్థాన్ మాదిరి మార్చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రవర్తనతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ స్టూడెంట్లకే ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని... ఇప్పటికిప్పుడు ఇలాంటి మార్పులు చేస్తే మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఏమి కావాలని ఆమె నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు సరిగా లేదని... భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దాడులు జరుగుతాయో అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన