సికింద్రాబాదు నుంచి విశాఖ, విజయవాడలకు ప్రత్యేక రైళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సికింద్రాబాదు నుంచి విశాఖ, విజయవాడలకు ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాదు - విజయవాడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. జులై 31, ఆగస్టు 7 తేదీల్లో విజయవాడ- సికింద్రాబాదుకు, ఆగస్టు 1, 8 తేదీల్లో సికింద్రాబాదు - విజయవాడకు ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ, విశాఖలతో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాదు - విశాఖ మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వారు వెల్లడించారు. అలాగే నాందేడ్ - పుణే మధ్య 16 ప్రత్యేక రైళ్లు, ఔరంగాబాద్ - తిరుపతి మధ్య 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

More Telugu News