టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కలసి సీక్రెట్ గా డిన్నర్ చేశారు. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లోని బ్రెజిలియన్ రెస్టారెంట్ లో వీరిద్దరూ విందు ఆరగించినట్టు బీబీసీ రేడియో ఓ కథనం ప్రసారం చేసింది. సాంకేతిక నైపుణ్యంతో షాట్లు ఆడే కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్నాడు. కోహ్లీకి ఇదే తొలి ఇంగ్లండ్ పర్యటన దీంతో ఇక్కడి పిచ్ లపై పెద్దగా అవగాహన లేదు.
వాన్ కు ఇక్కడి పిచ్ లు కొట్టిన పిండి. దీంతో ఇక్కడ రాణించడానికి కోహ్లీ విందు గాలమేసి ఉంటాడని మాజీలు చెబుతున్నారు. కాగా, డిన్నర్ వ్యవహారం రెండు శిబిరాల్లో ఆసక్తిని రేపింది. దీనిపై వాన్, కోహ్లీ స్పందించకపోవడంతో ఊహాజనిత కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. విందు తరువాత ఇంగ్లీష్ స్వింగ్ పిచ్ లపై బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటే వారి మధ్య కోహ్లీ బ్యాటింగ్ పై చర్చ జరిగినట్టు, లేకుంటే ఇంకేమైనా చర్చలు జరిగినట్టు భావించడమే!
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన