పసిడి పతకం గెలిస్తే... కోట్ల రూపాయల నజరానా

31-07-2014 Thu 07:24
హర్యానా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గే హర్యానా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై భారీ మొత్తాన్ని బహుమతిగా ఇవ్వనుంది. కామెన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిస్తే కోటిరూపాయలు, రజతానికి రూ. 50 లక్షలు, కాంస్యానికి రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ తెలిపింది. ఇంతకుముందు ఈ మొత్తం స్వర్ణానికి 25 లక్షలు, రజతానికి రూ.10 లక్షలు, కాంస్యానికి రూ. 5 లక్షలు గా ఉండేది. ఇకపై ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం గెలిస్తే రూ.2 కోట్లు, రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు హర్యానా సర్కార్ ఇవ్వనుంది. గతంలో ఆసియా క్రీడల్లో స్వర్ణానికి రూ.25 లక్షలు, రజతానికి రూ.15 లక్షలు, కాంస్యానికి రూ.10 లక్షలను హర్యానా సర్కార్ బహుమతిగా ఇచ్చేది. బుధవారం హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ ఈ కొత్త నజరానాను ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో హర్యానా క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 3 బంగారం, 5 రజత పతకాలు గెలుచుకున్నారని ఆయన ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను మరింత ప్రోత్సాహించడానికే ఇంత భారీ నజరానాను ప్రకటించామని భూపేందర్ సింగ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సాహించడంలో హర్యానా రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది. గతంలో ఒలింపిక్స్ జరిగినప్పుడు హర్యానా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆ రాష్ట్ర సర్కార్ బంగారు పతకానికి రూ.5 కోట్లు, రజత పతకానికి రూ.3 కోట్లు, కాంస్య పతకానికి రూ.2 కోట్లు ప్రకటించి క్రీడాలోకం మన్ననలు అందుకుంది.

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more